మన భారత దేశంలో హిమాలయాలకు అత్యంత సమీపంలో ఉన్న రాష్ట్రం ఉత్తరాఖండ్. ఆహ్లాదకరమైన ప్రకృతికి పుట్టినిల్లు ఈ రాష్ట్రం. ఈ రాష్ట్ర రాజధాని డెహ్రాడున్ నించి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరం లో ఉన్న సుందరమైన హిల్ స్టేషన్ 'ముస్సోరీ'. పచ్చదనం విరబూసిన ఈ ప్రదేశం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఇక్కడ ఎంతో చల్లగా ఉండడంతో ఎంతో మంది పర్యాటకులతో సందడిగా ఉంటుంది. జనవరి నించి ఏప్రిల్ వరకు మంచు కురుస్తూనే ఉంటుందిక్కడ.
మేమందరం హైదరాబాద్ నించి ఢిల్లీ వరకు విమానంలో ప్రయాణించి అక్కడి నించి టాక్సీ మాట్లాడుకుని ముస్సోరీ ప్రయాణం సాగించాము. కావాలనుకుంటే డెహ్రాడున్ వరకు ట్రైన్ లో ప్రయాణించి ఆ పై ముస్సోరీ ప్రయాణం లోకల్ టాక్సీ లలో సాగించవచ్చు.మేము ఢిల్లీ నించి ప్రయాణం సాగించాము కాబట్టి మార్గ మధ్యంలో ఉన్న ఆధ్యాత్మిక ప్రదేసాలయిన సుఖస్తలి మరియు హరిద్వార్ ని ముందుగా దర్సనం చేసుకున్నాము.సుఖ మహర్షి పరిక్షితు మహారాజుకి సప్తాహం లో బాగవతం చెప్పిన అధ్బుత ప్రదేశం సుఖస్తలి. ఇక్కడి గంగ నది కూడా అత్యంత పావనమయినది. ఇక హరిద్వార్ గంగ నది అక్కడి పవిత్ర గుళ్ళు ఎంత చుసిన తనివితీరదు.ఎంతో వేగంగా ప్రవహించే గంగ నది సర్వ పాపాలని హరించి వేస్తుంది. ఈ విధంగా మా ముస్సోరీ ప్రయాణం లో ఆధ్యాత్మికత కూడా చోటు చేసుకుంది. ఇక్కడి నించి ముస్సోరీ చేరేసరికి రాత్రి అయ్యింది. ముస్సోరీ లో మేము బస చేసిన హోటల్ రూం నించి హిమాలయాల సుందర సోయగమైన దృశ్యం చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు. ఉదయం లేచి ఆ ద్రుస్యాలని తనివితీరా ఆస్వాదించి తయారయ్యాము. అసలు మన దక్షిణాది ఆహరం దొరకదు అనుకున్న ఈ ప్రదేశం లో సౌతిండియా హోటల్స్ లెక్కకు మించి ఉన్నాయంటే ఆశ్చర్యపోక తప్పదు. చక్కని ఇడ్లి దోస అల్పాహారం ఆస్వాదించి ముస్సోరీ నగర అందాలని వీక్షించడానికి బయలుదేరాము. ముందుగా ropeway పై ఎక్కి హిల్ వ్యూ పాయింట్ చేరుకున్నాము. ప్రకృతి సౌందర్యాన్నంత తనలోనే ఇముడ్చుకొని ఉందేమో అన్నంత సుందరంగా కనిపించింది ముస్సోరీ. అంతే కాదు ఇక్కడి సంప్రదాయక మైన దుస్తులు ధరించి ఫోటోలు కూడా తీసుకున్నాము. అక్కడి నించి లోకల్ టాక్సీ బుక్ చేసుకుని ప్రాచీన బుద్ధ మందిరము చేరుకున్నాము. బుద్ధమతచారంగా ఇక్కడ అమర్చిన గంటలు ప్రత్యేక ఆకర్షణలు. ఈ గంటల్ని కొట్టినవారికి సకల శుభాలు కలుగుతాయని అక్కడి నమ్మకం. అటుతరవత అత్యంత సుందరమైన జలపాతం 'kemptywaterfalls ' చేరుకున్నాము.ఎంతో ఎత్హునించి పడే ఈ జలపాతం ఎంతో ఆకట్టుకుంది. మా బృందం లోని చిన్నారులు ఈ జలపాతంలో ఆదుకుని హాయిగా సేదతీరారు. మరొక విషయం మేము గమనించినది ఏమిటంటే ఎలాంటి చోటైన చాలా రుచికరమైన ఆహరం లభించేది. దారి పొడవున మొక్క జొన్న కంకులు, బటానీలు, వేడి వేడిగా noodles అన్ని దొరకడంతో ప్రయాణమంత బాగా సరదాగా అనిపించింది. ఆ తరవాత ప్రకృతి నడుమ కొండపై ఉన్న అమ్మవారి గుడిని దర్సించాం. వందకు పైగా మేట్లున్న ఈ గుడికి చేరుకున్నాక మరో హిల్ వ్యూ పాయింట్ గుర్తుకువచ్చింది. అలా ఆ రోజంతా సరదాగా తిరిగి సాయంత్రానికి హోటల్ రూం చేరుకున్నాము. రాత్రి అల్పాహారం సౌతిండియా హోటల్ లో కానిచ్చి పడుకున్నాము.
మరునాడు ఉదయం తయారయ్యి లోకల్ టాక్సీ లో 'dhanaulty ' అనబడే మరొక సుందర ప్రదేశానికి బయలుదేరాము. దారి పొడవున హిమాలయ మంచు కొండలు కనువిందు చేసాయి. ఆ రోజు ఉదయం కురిసిన వాన తో తేట పడి ఎంతో సుందరంగా దర్సనమిచ్చాయి ఈ మంచు కొండలు. ఈ ప్రదేశం లో ఉన్న ecopark చిన్నారులకు ప్రత్యేకం. ఇక్కడి rope walking మరియు manual ropeway చిన్నారులు ఎంతో ఇష్టపడతారు. అంతే కాదు ఇక్కడ ఎన్నో రకాల వింత వింత చక్కని ఉయ్యాలలు అలసట మరిచేలా చేసాయి. అక్కడి చల్లని వాతావరణానికి వేడి వేడి గ మాగీ noodles తినడం చక్కని అనుభూతి. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే chardham యాత్ర లో భాగమైన యమునోత్రి ఇక్కడి నించి కేవలం 155 కిలోమీటర్లు మాత్రమే. అంటే హిమాలయ పర్వత శ్రేణికి అత్యత దెగ్గరగ ఉన్న ప్రదేశం ఇది. ఎంతో సేపు ఇక్కడ సేద తీరాక తిరుగు ప్రయాణం అయ్యి ముస్సోరీ lake చేరుకున్నాము. ఇక్కడ పెడల్ బోఅటింగ్ చేసి కాసేపు కూర్చుని తిరిగి ముస్సోరీ హోటల్ రూం చేరేసరికి సాయంత్రం అయ్యింది. ముస్సోరీ లోనే దొరికే వైవిధ్యమైన కొన్ని వస్తువులు షాపింగ్ చేసుకున్నాము. కష్మీరి వస్త్రశ్రేని మరియు ఇతర హన్దిక్రాఫ్త్స్ ఎంతో ఆకట్టుకునేలో ఉంటాయి. ఇక్కడ దొరికే ఉన్ని దుస్తుల రకాలు మరెక్కడా దొరకని విధంగా ఉన్నాయి. దగ్గరి వారందరికీ చక్కని బహుమానాలుగా ఇక్కడి వస్తువులు కొన్నాము. అలా ఇక్కడి పదిలమైన అనుభూతుల మధ్య ఆ రాత్రి పడుకున్నాము.
మరునాడు ఉదయం ఆరింటికే ముస్సోరీ నించి తిరిగి ఢిల్లీ ప్రయాణం అయ్యాము. మార్గమధ్యం లో రిషికేశ్ దర్సిన్చుకున్నాము. ఇక్కడి ప్రసిద్ధి కాంచిన వంతెనలు Ramjhula మరియు Laxmanjhula ఎంతో ఎంతో మనోహరంగా ఉంటాయి. ఈ రెండు వంతెనలు నిర్మించి ఎన్నో సంవత్సరాలు అయిన ఇప్పటికి పదిలంగా ఉన్నాయి. వంతెనల కింద నించి పారే గంగ నది ఎంతో అధ్బుతంగా ఉంటుంది. దీంతో మా ప్రయాణం ఒక కొలిక్కి వచ్చినట్టయ్యింది. ఇక నేరుగా ఢిల్లీ వరకు ప్రయాణం సాగించి రాత్రి ఢిల్లీ లో విమాన ప్రయాణం చేసి హైదరాబాద్ చేరుకున్నాము.